Medak: పోచారం అడవి లో బర్డ్ వాక్ నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్
Medak: మెదక్ జిల్లా పోచారంలో ఘనంగా జరిగిన బర్డ్ వాక్ కార్యక్రమం. అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరు.
Medak: పోచారం అడవి లో బర్డ్ వాక్ నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్
మెదక్ : ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.
శనివారం పోచారంలోని డిబిసిలో నిర్వహించబడే బర్డ్ వాక్‌లో డీఎఫ్ఓ జోజి ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బందితో చేపట్టిన ఈ కార్యక్రమంలో మెదక్ డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు, తో కలిసి అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జెండాతో ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్ఓ జో.జి పోచారంలోని డిబిసిలో నాలుగు కిలోమీటర్ల బర్డ్ వాక్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా బర్డ్ వాక్ నిర్వహించడం జరిగిందన్నారు పోచారం ల్యాండ్‌స్కేప్ యొక్క గొప్ప పక్షి వైవిధ్యం మరియు సహజ వారసత్వం పట్ల ప్రశంసను ప్రోత్సహించడానికి, బర్డ్ వాక్ నిర్వహించామన్నారు.
పోచారం జలాశయం, అభయారణ్యం చుట్టూ ఉన్న పోచారం ప్రాంతం, వలస నీటి పక్షులు, కొంగలు, ఐబిస్‌లు, బాతులు అనేక అటవీ ప్రాంతాలతో సహా విభిన్న పక్షి జీవనానికి ప్రసిద్ధి చెందిందన్నారు.ఇది ఒక ముఖ్యమైన పక్షి వీక్షణ గమ్యస్థానంగా నిలుస్తుందనీ.
ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, అధికారులు పాల్గొని వివిధ రకాల పక్షులను విక్షించాలని, పక్షుల జీవన విధానం, వలస పక్షుల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర గురించి, పక్షుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లు నాటడం, నీటి వనరులను కాపాడడం, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అవసరం అన్నారు, ప్రకృతిని దగ్గరగా ఆస్వాదిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవడానికి బర్డ్ వాక్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ లు బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.




