Medak: సొంత విత్తనాలు వాడిన రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలి కొండరెడ్డి!
Medak: సన్న వరికి రూ.500 బోనస్: సొంత విత్తనాలు వాడిన రైతులకు వర్తింపజేయాలని షాపు రసీదుల నిబంధన సడలించాలని మెదక్ సిటిజన్స్ ఫోరం విజ్ఞప్తి.
Medak: సొంత విత్తనాలు వాడిన రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలి కొండరెడ్డి!
Medak: మెదక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల సన్న వరి సాగు చేస్తున్న రైతులకు 500/- రూపాయలు బోనస్ ను పొందడానికి రైతులు వరి విత్తనాలను విక్రయించిన షాపుల వద్ద ఆన్లైన్ చేయించుకోవాలని బట్టి రిసిప్ట్లను జత చేసిన వారికి మాత్రమే బోనస్ ను చెల్లిస్తానని ప్రకటించడం సరియైన నిర్ణయం కాదని మెదక్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు బి కొండ రెడ్డి తెలిపారు. కొంతమంది రైతులు రబీ సీజన్లో మంచి దిగుబడి వచ్చిన రైతుల నుండి లేదా తమ సొంత పొలంలో పండిన వంగడాలను ఖరీఫ్ సీజన్లో వాడడం ఆనవాయితీగా జరుగుతుంది.
రైతులు స్వయం సమృద్ధి సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్వంత విత్తనాలను వాడే వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని, విత్తన కంపెనీలను ప్రోత్సహించే ఇలాంటి చర్యలను మానుకోవాలని కోరినారు. ప్రస్తుత సీజన్లో సొంత విత్తనాలు వాడిన వారందరికీ సన్న వడ్లకు ఇచ్చే 500/- రూపాయలు బోనస్ ను పొందడానికి అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కు సూచనలు ఇవ్వాల్సిందిగా అయినా కోరినారు.




