Medak: కోనాయపల్లి సర్పంచ్, కార్యదర్శిపై డీఎల్పీవో విచారణ!
Medak: మనోహరాబాద్ మండలం కోనాయపల్లిలో దళితులపై దాడి ఘటనపై డీఎల్పీవో విచారణ చేపట్టారు. సర్పంచ్‌ను అరెస్ట్ చేయకుంటే నవంబర్ 5న తూప్రాన్ డీఎస్పీ ఆఫీసుకు పాదయాత్ర చేస్తామన్నారు.
Medak: కోనాయపల్లి సర్పంచ్, కార్యదర్శిపై డీఎల్పీవో విచారణ!
మెదక్: మనోహరాబాద్ మండలం కోనాయపల్లి గ్రామంలో అక్టోబర్ 18 నాడు దళితులపై జరిగిన దాడిపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు కోనాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో తుప్రాన్ DLPO సాయిబాబా విచారణ చేపట్టినారు.దాడి జరిగిన వివరాలను బాధితులు వివరించడం జరిగింది. దాడి చేసిన గ్రామ సర్పంచ్‌ను పదవి నుండి తొలగించాలని బాధితులు కోరడం జరిగింది.
దాడి చేసిన వారు పదవిలో కొనసాగే అర్హత సర్పంచ్ కు లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శి దాడికి గురైన పంచాయతీ కార్మికులను పరామర్శించలేదు. పంచాయతీ కార్యదర్శి విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేశారు.దళితులపై దాడి జరిగితే జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ప్రకారం దళిత వాడను సందర్శించలి కానీ కోనాయపల్లి పంచాయతీ కార్యదర్శి దళిత వాడను సందర్శించలేదు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం విధులను దుర్వినియోగం చేసిన పంచాయతీ సర్పంచ్ ను పదవి నుండి తొలగించాలి. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని కోరడం జరిగింది.
నవంబర్ 5 న కోనాయపల్లి నుండి తుప్రాన్ DSP కార్యాలయకు పాదయాత్ర
కోనాయపల్లి గ్రామంలో దళితులపై దాడి చేసి గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5 నాడు కోనాయపల్లి నుండి తుప్రాన్ DSP కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని DBF జాతీయ కార్యదర్శి పి శంకర్, KVPS రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య తెలిపారు. నవంబర్ 4 వరకు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో DBF జాతీయ కార్యదర్శి పి శంకర్, KVPS రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య, జిల్లా కార్యదర్శి నిరంజన్ దాసు, DBF తుప్రాన్ డివిజన్ అధ్యక్షులు పంచమి చంద్రం, బాధితులు నర్సిములు, ప్రవీణ్, నిరంజన్ దాసు, గురూదాస్, శ్రావణి, అర్జున్, మల్లేష్, అండాలు, ఎల్లమ్మ, బిక్షపతి, ఈశ్వర్ లతో పాటు దళితులు పాల్గొన్నారు.




