Medak: రైతుల సమస్యలు పట్టించుకోకపోతే జిల్లా వదిలి వెళ్ళండి: అధికారులపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఫైర్!

Medak: మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అధికారులపై నిప్పులు చెరిగారు.

NAGARAJ, MEDAK
Published on: 9 May 2026 9:12 PM IST
Medak
X

Medak: రైతుల సమస్యలు పట్టించుకోకపోతే జిల్లా వదిలి వెళ్ళండి: అధికారులపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఫైర్!

మెదక్: మెదక్ అధికారులు ఏసీ గదులను కూర్చొని రైతుల సమస్యలు పట్టించుకోకపోతే జిల్లా నుండి వెళ్లిపోవచ్చని రైతుల సమస్యలను పట్టించుకోని వాటిని పరిష్కరించే విధంగా ఉంటేనే జిల్లాలో పనిచేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు శనివారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో రైతుల సమస్యలపై రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధికారులపై తీవ్రంగా విమర్శించారు వరి ధాన్యము రెండు నెలల నుండి ధాన్యంపులి కేంద్రాల వద్ద లారీలు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు ఒక్క పదిహేను రోజుల తర్వాత భారీ వర్షాలు పడతాయని రైతుల పరిస్థితి ఏమిటది ఇంటర్సిటీగా ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ అయి ఉండి ఫోన్ లేపకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు నాలుగు రోజుల నుండి సెలవులపై ఉంటే ఇంచార్జి ఎవరికి ఇవ్వలేదని ఆయన జెసి అదనపు కలెక్టర్ను ప్రశ్నించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అయినా ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు వస్తే తనను ఊరుకోనని రైతుల కోసం పోరాడతానని ఆయన అన్నారు ఇప్పటికైనా లారీల హమాలీల కొరతను తీర్చి లారీలను సకాలంలో ధాన్యం కేంద్రాల వద్దకు తరలించాలని ఆయన జిల్లా అధికారులకు సూచించారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ కనుగు రాధిక భూపతి రాజు వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ జిల్లా వ్యవసాయ అధికారులు జిల్లా అధికారులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story