Medak: మెదక్ అధికారులపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆగ్రహం: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై సీరియస్!

Medak: మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

NAGARAJ, MEDAK
Published on: 9 May 2026 7:28 PM IST
Medak
X

Medak: మెదక్ అధికారులపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆగ్రహం: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై సీరియస్!

మెదక్: చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో అదనపు కలెక్టర్ నగేష్,వ్యవసాయ, సివిల్ సప్లై, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. ధాన్యం చివరి గింజలకు కొనాలని, ధాన్యం తరలింపు ప్రక్రియలో ఆలస్యం అవుతుందని, రైస్ మిల్లులో హమాలీల సమస్యను పరిష్కరించుకోవాలని, ధాన్యం తరలింపు ప్రక్రియలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు తెలుపాలని అధికారులపై ఆగ్రహించారు. రైతులు ధాన్యం తరలింపు పై రోడ్లపైకి వచ్చిన సంఘటన, ధర్నాలు చేసిన విధానం, రైతు పెట్రోల్ బాటిల్ తో రోడ్ల పైకి వచ్చారు ఇలాంటి సంఘటనకు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు.

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతు సమస్యలపై తప్పకుండా గళం ఎత్తుతామన్నారు. ముఖ్యమంత్రి ,మంత్రులు 24 గంటలు రైతుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు వివరించారు. తాను ప్రజలు, రైతులు ఎన్నుకుంటే వచ్చానని వారికోసం ఎవరినైనా ప్రశ్నిస్తానన్నారు. తక్షణమే అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలను స్పీడ్ అప్ చేయాలని అధికారులు ఆదేశించారు.

అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ సజావుగా నిర్వహిస్తామని, హమాలీల సమస్యను పరిష్కరిస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపడతామన్నారు. నాలుగైదు రోజుల్లో మరింత స్పీడ్ అప్ చేసి రైస్ మిల్లుల వద్ద అన్ లోడింగ్ ప్రక్రియను సైతం త్వరిత గతిన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధికా భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story