Narsapur: నర్సాపూర్‌లో ఎల్‌నినో ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్!

Narsapur: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నర్సాపూర్ రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 28 Oct 2026 11:25 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో ఎల్‌నినో ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్!

నర్సాపూర్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌తో కలిసి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని గ్రామస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భారతి, ఎంపీవో, మండల వ్యవసాయ అధికారి దీపిక, పంచాయతీరాజ్ శాఖ డీఈ, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో అవసరమైన ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసుకోవడం, సంబంధిత శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడం వంటి అంశాలపై సమావేశంలో దృష్టి సారించారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR