Medak: బాలిక కిడ్నాప్ కేసు: నిందితుడికి 7 ఏళ్ల జైలు

Medak: బాలికను మాయమాటలతో తీసుకెళ్లిన కేసులో ఆనంద్ అనే నిందితుడికి 7 ఏళ్ల జైలు, రూ.30 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది.

RAJU,TOOPRAN
Published on: 27 Oct 2026 6:32 PM IST
Medak
X

Medak: బాలిక కిడ్నాప్ కేసు: నిందితుడికి 7 ఏళ్ల జైలు

మెదక్: బాలికను మాయమాటలతో నమ్మించి వెంట తీసుకెళ్లిన కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ పోక్సో కోర్టు తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు.

ఘటన వివరాలు: 8వ తరగతి చదువుతున్న బాలికను ఆమె తండ్రి 14-10-2025న హాస్టల్ కు వెళ్లేందుకు బస్సు ఎక్కించారు. వడియారం వద్ద బస్సు ఆగకపోవడంతో బాలిక చేగుంటలో దిగింది. పరిచయమున్న ఆనంద్ (22) అనే యువకుడికి ఫోన్ చేసి హాస్టల్ వద్ద దింపాలని కోరగా, అక్కడికి చేరుకున్న ఆనంద్ మాయమాటలు చెప్పి బాలికను వెంట తీసుకెళ్లాడు.

మొదట మేడ్చల్ కు, అనంతరం నిజామాబాద్ కు, మరుసటి రోజు సికింద్రాబాద్ లోని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. బాలికను ఇంటికి పంపాలని ఆనంద్ తల్లి సూచించడంతో అక్టోబర్ 15, 2025 రాత్రి 8 గంటలకు బస్ స్టాండ్ కు వెళ్లగా తూప్రాన్ పోలీసు సిబ్బంది గుర్తించి భరోసా కేంద్రానికి తరలించారు.

తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు కాగా, కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేశారు. దర్యాప్తు అధికారి ఎస్ఐ ఎన్. జ్యోతి సాక్ష్యాధారాలు సేకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించగా, లీగల్ అడ్వైజర్ శ్వేత సహకరించారు. కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణగౌడ్, సీడీఓ నాగరాజు సహకరించారు.

సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆర్.ఎం. సుభవల్లి నిందితుడికి శిక్ష విధించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN