Medak: పోలీస్ అమరవీరులకు నివాళి: మెదక్లో 108 మంది రక్తదానం!
Medak: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్ డీపీఓలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాసరావు రక్తదానం చేయగా, మొత్తం 108 మంది పాల్గొన్నారు.
Medak: పోలీస్ అమరవీరులకు నివాళి: మెదక్లో 108 మంది రక్తదానం!
మెదక్, అక్టోబర్ 28: పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రభుత్వ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రారంభించి, స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.
ఈ శిబిరంలో పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు కలిపి మొత్తం 108 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు.రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన దాతలను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, రంగనాథ్, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్ఐలు రామకృష్ణ, శైలేందర్, ఎస్ఐలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా చైర్మన్ తిరుమలేష్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.




