Medak: సిరిసిల్ల రాజన్న జోన్ క్రికెట్ టోర్నమెంట్‌లో మెదక్ జట్టు విజయం
Medak: రాజన్న జోన్ పోలీస్ క్రికెట్ టోర్నమెంట్‌లో మెదక్ జట్టు విజేతగా నిలిచింది. తూప్రాన్ సీఐ వెంకట రాజాగౌడ్ కెప్టెన్సీలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది.
Medak: సిరిసిల్ల రాజన్న జోన్ క్రికెట్ టోర్నమెంట్‌లో మెదక్ జట్టు విజయం
మెదక్: సిరిసిల్ల రాజన్న జోన్ స్థాయిలో నిర్వహించిన పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ లో మెదక్ జిల్లా జట్టు ఘన విజయం సాధించి కప్ కైవసం చేసుకుంది.
ఐదు జిల్లాల పోలీస్ జట్ల మధ్య ఈ టోర్నమెంట్ జరిగింది. మెదక్ క్రికెట్ జట్టుకు తూప్రాన్ సీఐ వెంకట రాజాగౌడ్ కెప్టెన్ గా వ్యవహరించారు.
ఆయన నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలిచింది. జట్టు విజయం సాధించడంతో తూప్రాన్ సీఐ వెంకట రాజాగౌడ్ కు పలువురు అభినందనలు తెలియజేశారు.




