Medak: రైలు ఢీకొని 40 గొర్రెలు మృతి జీవనాధారం కోల్పోయాం.. ఆదుకోండి పశువుల కాపరి రోదన!
Medak: మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్లలో రైలు ఢీకొని 40 గొర్రెలు మృతి మెదక్-అక్కన్నపేట ట్రాక్‌పై ప్రమాదం తీవ్రంగా నష్టపోయిన గొర్రెల కాపరి కూకట్ల రెడ్డయ్య.
Medak: రైలు ఢీకొని 40 గొర్రెలు మృతి జీవనాధారం కోల్పోయాం.. ఆదుకోండి పశువుల కాపరి రోదన!
మెదక్, సెప్టెంబర్ 29: రామాయంపేట మండలం తొనిగండ్ల శివారులో మంగళవారం రైలు ఢీకొని సుమారు 40 గొర్రెలు మృతి చెందాయి. మెదక్–అక్కన్నపేట రైల్వే మార్గంలో పట్టాల వద్ద ఉన్న గొర్రెలను మెదక్ నుంచి అక్కన్నపేట వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కూకట్ల రెడ్డయ్యకు చెందిన సుమారు 40 గొర్రెలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో గొర్రెలు మృతి చెందడంతో బాధితుడు తీవ్రంగా నష్టపోయాడు. జీవనాధారమైన గొర్రెలను కోల్పోయిన తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని తగిన పరిహారం అందించాలని రెడ్డయ్య కోరారు.




