Ramayampet: రామాయంపేట 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి!

Ramayampet: మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నార్సింగికి చెందిన లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RAJU,TOOPRAN
Published on: 9 Nov 2026 11:29 PM IST
Ramayampet
X

Ramayampet: రామాయంపేట 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి!

రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందారు. నార్సింగి పట్టణానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో నార్సింగిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN