Medak: బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం.. సీఎం రేవంత్ ఆదుకోవాలి

Medak: తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, కేసీఆర్ వారిని అణచివేశారని ఎస్సీ, ఎస్టీ మాజీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు.

NAGARAJ, MEDAK
Published on: 29 May 2026 4:37 PM IST
Medak
X

Medak: బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం.. సీఎం రేవంత్ ఆదుకోవాలి

Medak: తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకునే భారత రాష్ట్ర సమితి కనీసం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేక పోయిందని ఉద్యమకారులను అంచు వేయడంలో కేసీఆర్ ముందంజలో ఉంటారని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి చేయూతనివ్వాలని ఎస్సీ ఎస్టీ మాజీ కమిషన్ చైర్మన్ . విద్యార్థి ఉద్యమ నాయకుడు పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం మెదక్ ఐబి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి కేకే కమిటీ వేయడం జరిగిందని.

జిల్లాలో ఉద్యమకారులను గుర్తించి వారికి చేయూతనివ్వాలని ఆయన అన్నారు దీని కోసం తెలంగాణ ఉద్యమకారులను ఐక్యం చేసి హైదరాబాద్లో జూన్ రెండో తేదీన తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూపల్లి కృష్ణారావును రావడం జరుగుతుందని దీనికి జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరూ రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డుతో పాటు 260 గజాల స్థలాన్ని నెల పింఛన్ అందేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై కేసులు ఉన్నాయని వాటిని తినేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ఇటీవల కేకే తో పాటు ఉద్యమ సబ్ కమిటీ వేయడం జరిగిందని అన్నారు.

ప్రభుత్వ సబ్ కమిటీ ఆయా జిల్లాలో వచ్చినప్పుడు ఉద్యమకారులు చేసిన ఉద్యమాల( ప్రూఫ్) ఆధారాల తో పాటు గట్టి గలాన్ని వినిపించాలని కోరారు.

తెలంగాణ ఉద్యమాల గడ్డ అని అన్నారు.

ఉద్యమం తోటే తెలంగాణ సాధ్యం జరిగిందని అయినా తెలిపారు తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తున్న ఆంధ్రాలో కొంతమంది నాయకులు ఇప్పటికే తెలంగాణ పట్ల వివక్షత చూపుతున్నారని తెలంగాణ ఆంధ్ర విడిపోయి 12 సంవత్సరాలు అయ్యి అన్నదమ్ముల వల్లే కలిసి ఉన్నామని కొంతమంది ఆంధ్ర నాయకులు తెలంగాణ పై తప్పుడు ప్రచారం నిర్వహించడం మానుకోవాలని ఆయన తెలిపారు ఈ మీడియా సమావేశంలో. న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్ స్వామి నాయక్ .రాజేష్, జయరాజ్, రఘు, దుర్గయ్య మానవ హక్కుల వేదిక హైమద్, శ్రీధర్, భాను, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story