Medak: మెదక్‌లో ఆడబిడ్డల సందడి.. జాగృతి బతుకమ్మ సంబురం!

Medak: మెదక్ పట్టణంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆటపాటలతో సందడి చేయగా, ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు.

NAGARAJ, MEDAK
Published on: 16 Oct 2026 2:41 PM IST
Medak
X

Medak: మెదక్‌లో ఆడబిడ్డల సందడి.. జాగృతి బతుకమ్మ సంబురం!

మెదక్, అక్టోబర్ 16: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు మెదక్ పట్టణంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రజిత, ఉమ్మడి మెదక్ జిల్లా మహిళా కన్వీనర్ రాజేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. అనంతరం అందంగా అలంకరించిన బతుకమ్మల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ఐదుగురు మహిళలకు బహుమతులు అందజేశారు.

సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటలతో సాగిన ఈ వేడుకలు మెదక్ పట్టణంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జి బట్టి అజయ్, సీనియర్ నాయకుడు ఇప్ప రమేష్, విద్యార్థి విభాగం నాయకుడు ఎండీ జునైద్‌తో పాటు కరాటే ప్రేమ్, గుట్టకిందిపల్లి రాజశేఖర్, చౌదరి భాను, చౌదరి నవీన్, అల్తాఫ్, అయ్యాన్, జంగం నాగరాజు, వేపూరి శ్రీనివాస్, కంచి విజయ్ కుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK