Toopran: సుబ్రహ్మణ్యం మృతి కేసులో ప్రవీణ్, చైతన్య రిమాండ్!

Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ పెద్ద చెరువులో యువకుడు సుబ్రహ్మణ్యం మృతి చెందిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గంగరాజు వెల్లడించారు.

RAJU,TOOPRAN
Published on: 29 Oct 2026 7:40 PM IST
Toopran
X

Toopran: సుబ్రహ్మణ్యం మృతి కేసులో ప్రవీణ్, చైతన్య రిమాండ్!

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని పెద్ద చెరువులో నీటిలో మునిగి సుబ్రహ్మణ్యం (అలియాస్ మున్నా) మృతి చెందిన ఘటనకు సంబంధించి, మృతుడి తల్లి కళ్లెం శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.

దర్యాప్తులో భాగంగా, మృతుడు సుబ్రహ్మణ్యంతో ప్రవీణ్ మరియు చైతన్య అనే ఇద్దరు యువకులు గొడవ పడినట్లు, గొడవ అనంతరం వారి మధ్య జరిగిన సంఘర్షణలో నిందితులు మాట్లాడిన మాటల కారణంగా సుబ్రహ్మణ్యం చెరువులో దూకి మునిగిమృతి చెందినట్లు మృతుడి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తులో సేకరించిన వివరాల ఆధారంగా ప్రవీణ్ మరియు చైతన్యలను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం ఇద్దరి ని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించిన్నట్లు ఎసై గంగరాజు తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి చిన్నచిన్న వివాదాలను గొడవలుగా మార్చుకోకుండా సంయమనం పాటించాలి. ఆవేశంలో మాట్లాడే మాటలు, చేసే పనులు ఇతరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఎసై గంగరాజు పేర్కొన్నారు ఈ సమావేశం లో ఎసై యాదిగిరి మరో ట్రైని ఎసై ఉన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN