Medak: పోషణ మేళాలో తూప్రాన్ జూనియర్ కళాశాలకు ప్రథమ బహుమతి!
Medak: మెదక్ జిల్లా స్థాయి పోషణ మేళాలో తూప్రాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రథమ బహుమతి సాధించింది. కలెక్టర్ ప్రతిమా సింగ్ చేతుల మీదుగా ప్రిన్సిపాల్ అవార్డు అందుకున్నారు.
Medak: పోషణ మేళాలో తూప్రాన్ జూనియర్ కళాశాలకు ప్రథమ బహుమతి!
మెదక్: మెదక్ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోషణ మేళాలో తూప్రాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రథమ స్థానాన్ని సాధించింది. పోషకాహారం ప్రాముఖ్యత, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై కళాశాల ఏర్పాటు చేసిన ప్రదర్శనకు ప్రథమ బహుమతి లభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ గారి చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రభావతి ప్రథమ బహుమతిని అందుకున్నారు.
ఈ ఘనత సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కళాశాల సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడానికి పోషణ మేళా ఎంతగానో దోహదపడిందని తెలిపారు.




