Medak: మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ నూతన కమిటీల నియామకం!
Medak: మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకాలు జరిగాయి.
Medak: మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ నూతన కమిటీల నియామకం!
Medak: మెదక్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయేలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పిలుపు ప్రతి పనిని ముందుండే నడిపిస్తానని మెదక్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మందుగుల గంగాధర్ అన్నారు. మంగళవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గానికి చెందిన కొత్త మండల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. సందర్భంగా మెదక్ పట్టణ అధ్యక్షుడుగా ఎన్నికైన గంగాధర్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మహేష్ గౌడ్. జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్. రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నియామకం
మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారు. మెదక్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు.ఎం. నాగరాజు.హవేలీ ఘన్‌పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు. జి. కిరణ్ గౌడ్.పాపన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు.నరంధర్ గౌడ్.శంకరంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ నాయక్.రామాయంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు. బండారి మహేందర్ రెడ్డి .రామాయంపేట టౌన్ కాంగ్రెస్ అధ్యక్షురాల చింతల స్వప్న.నిజాంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యెల్దుర్తి వెంకటేష్ నియమించారు. ఈ నియమకంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని, ఈ నియామకాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నాయని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.




