Medak: మెదక్‌లో ఆర్టీసీ కార్మికుల ఆవేదన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నివాళి
Medak: మెదక్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది.
Medak: మెదక్‌లో ఆర్టీసీ కార్మికుల ఆవేదన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నివాళి
మెదక్: మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్బంగా వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ లో ఒంటికి నిప్పంటించుకుని ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ నిన్న మృతిచెందడంతో.. మెదక్ ఆర్టీసీ కార్మికులు మెదక్ బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించరు. అనంతరం మెదక్ గుల్షన్ క్లబ్ నుండి. రాందాస్ చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శనా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా. బి ఆర్ ఎస్ పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ,, మరియు సిఐటియు వివిధ ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.. కోలా శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించాలని మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మళ్ళీ ఖర్జున్ గౌడ్ డిమాండ్ చేశారు.. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను, రాష్ట్ర ప్రభుత్వం అణచివేయాలని చూస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేషo ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




