Medak: ఉపాధి హామీ కూలిపై అడవి పంది దాడి!

Medak: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్లపల్లిలో అడవి పంది దాడి. ఉపాధి హామీ కూలీ చింతల అంజమ్మకు తీవ్ర గాయాలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స.

G Ashok Reddy, Narsapur
Published on: 2 Jun 2026 11:50 AM IST
Medak
X

Medak: ఉపాధి హామీ కూలిపై అడవి పంది దాడి!

మెదక్ జిల్లా: కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళపై అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామానికి చెందిన చింతల అంజమ్మ తోటి కూలీలతో కలిసి ఉపాధి హామీ పనుల నిమిత్తం అడవిలోకి వెళ్లగా, అకస్మాత్తుగా ఎదురైన అడవి పంది ఆమెపై దాడి చేసింది. ఈ ఘటనలో అంజమ్మ రెండు చేతులు, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిని గమనించిన తోటి కూలీలు వెంటనే ఆమెను అక్కడి నుంచి తరలించి చికిత్స నిమిత్తం కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story