Medak: మెదక్‌లో 5కే రన్ జోష్.. పరుగులు తీసిన కలెక్టర్ ప్రతిమా సింగ్!

Medak: మెదక్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాంచంద్ స్టేడియం వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాల్లో భాగంగా 5కే రన్ నిర్వహించారు.

NAGARAJ, MEDAK
Published on: 18 May 2026 1:42 PM IST
Medak
X

Medak: మెదక్‌లో 5కే రన్ జోష్.. పరుగులు తీసిన కలెక్టర్ ప్రతిమా సింగ్!

మెదక్ : 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా. యువజన, క్రీడల మరియు పర్యాటక వారోత్సవాల సందర్బంగా.. జిల్లా యువజన,క్రీడా శాఖ ఆధ్వర్యంలో మెదక్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ స్టేడియం వరకు నిర్వహించిన 5కే రన్ ను అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, ,జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు క్రీడాభిమానులు, తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు.

ధ్యాన్చంద్ చౌరస్తా వరకు సాగిన ఈ రన్ అనంతరం.. నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడానికి, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు స్థానిక పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడానికి క్రీడా మరియు పర్యాటక వారోత్సవాలను జిల్లా మండల స్థాయిలలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మెదక్ జిల్లాలో చూడ చక్కని పర్యాటక ప్రాంతాలకు నెలవుగా. టూరిజం స్పాట్ గా ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల సహకారంతో జిల్లా పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా యువత దైనందిక జీవితంలో మానసిక, శారీరక, ఆరోగ్యానికి, పరిరక్షణకై అందరు పాటుపడాలని పిలుపునిచ్చారు.ప్రతీ రోజూ వాకింగ్, రన్నింగ్ ప్రక్రియ..మన శారీరక ఓర్పును, మానసిక దృఢత్వాన్ని పరీక్షించే ఒక గొప్ప క్రీడాంశమని తెలిపారు

స్ట్రాటజీ, వేగం, ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు చాలా ఉపయోగమని...అలాగే మనలో క్రమశిక్షణ, ఓర్పును పెంపొందుతాయాన్నారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా...మానసిక ఒత్తిడిని తగ్గించి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ భారతదేశ శక్తివంతమైన దేశంగా ఉన్నదని విస్తీర్ణంలో

ఖనిజ సంపద, అడవి సంపద తో పోలిస్తే

వీటికి భిన్నంగా ప్రపంచంలో భారత దేశంలో యువశక్తి అత్యధికంగా కలదని యువత అధిక సంఖ్యలో ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు మెదక్ పట్టణంలో ఏ ర్యాలీ చేపట్టిన యువశక్తిని చాటాలన్నారు. ప్రతిరోజు యువత వ్యాయామాన్ని అలవర్చుకుని శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ పెద్దలను గౌరవిస్తూనేటి యువతే రేపటి భారీ భారత పౌరులు అనే నినాదంతో సమాజంలో ఉన్నత స్థానాలలో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ ఇంత ఘనంగా 5k రన్ కార్యక్రమం నిర్వహించినందుకు యువజన క్రీడల నిర్వహణ శాఖ యంత్రాంగాన్ని అభినందించారు. యువత జట్టుగా క్రీడలలో పాల్గొనడం ద్వారా స్నేహభావం పెంపొందడంతో పాటు ఈర్ష్యా దేశాలను పక్కనపెట్టి క్రమశిక్షణ గల జీవనశైలి వారికి అలవరుతుందని క్రీడాకారులకు నెలవు అనే నినాదంతో క్రీడాకారులకు క్రీడలలో తర్ఫీదునిస్తూ మండల జిల్లా రాష్ట్రస్థాయిలలో మెదక్ జిల్లా క్రీడాకారులు రాణిస్తున్నారంటే దానికి నిదర్శనం వ్యాయామ ఉపాధ్యాయులేనని కొని ఆడారు.

ఈ కార్యక్రమంలో యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి మధు సూదన్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు మాధవరెడ్డి, చంద్రమోహన్, వినోద్, మనోహర్, దేవేందర్ రెడ్డి. యన్.సి.సి. క్యాడెట్స్, క్రీడాకారులు యువకులు సుమారు 300 లకు పైగా పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story