Sangareddy: హత్నూరలో 47 ఏళ్ల మహిళ అదృశ్యం పోలీసుల గాలింపు!

Sangareddy: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగుల దేవులపల్లిలో 47 ఏళ్ల చాకలి లలిత అదృశ్యం. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 31 Aug 2026 7:19 AM IST
Sangareddy
X

Sangareddy: హత్నూరలో 47 ఏళ్ల మహిళ అదృశ్యం పోలీసుల గాలింపు!

Sangareddy: హత్నూర మండలం నాగుల దేవులపల్లి గ్రామానికి చెందిన చాకలి లలిత (47) అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లలిత ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఆమె కుమారుడు చాకలి శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఆగస్టు 26, 2026న మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో కుటుంబ సమస్యల విషయంలో లలిత తల్లిదండ్రుల మధ్య ఇంట్లో గొడవ జరిగింది. అనంతరం లలిత ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

ఆమె కోసం కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి ఇళ్ల వద్ద విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో కూడా వెతికారు. అయినప్పటికీ లలిత ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

అదృశ్యమైన మహిళ వివరాలు

పేరు: చాకలి లలిత

వయస్సు: 47 సంవత్సరాలు

ఎత్తు: సుమారు 4 అడుగుల 6 అంగుళాలు

ముఖం: గుండ్రంగా

జుట్టు: నలుపు, తెలుపు కలగలసినది

ఛాయ: చామన ఛాయ

అదృశ్యమైన సమయంలో ధరించిన దుస్తులు: బ్లూ అండ్ వైట్ రంగు చీర, బ్లూ రంగు బ్లౌజ్

ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలి

ఫిర్యాదు అందుకున్న పోలీసులు లలిత ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరిస్తూ వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

చాకలి లలిత ఆచూకీ గురించి ఎవరికైనా సమాచారం తెలిసినా, ఆమె ఎక్కడైనా కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story