Sangareddy: పోతిరెడ్డిపల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!

Sangareddy: పోతిరెడ్డిపల్లిలో కౌన్సిలర్ పొన్న దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

SRIKANTH, SANGAREDY
Published on: 19 Oct 2026 12:31 PM IST
Sangareddy
X

Sangareddy: పోతిరెడ్డిపల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!

Sangareddy: సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కౌన్సిలర్ పొన్న దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రపంచానికే ఆదర్శమని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. భారీ ఎత్తున వేడుకలకు ఏర్పాట్లు చేసిన కౌన్సిలర్ దశరథ్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

SRIKANTH, SANGAREDY

SRIKANTH, SANGAREDY