Sangareddy: పోతిరెడ్డిపల్లిలో వైభవంగా దుర్గాభవాని శరన్నవరాత్రి ఉత్సవాలు!

Sangareddy: పోతిరెడ్డిపల్లిలో కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ దుర్గాభవాని నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్!

SRIKANTH, SANGAREDY
Published on: 18 Oct 2026 3:45 PM IST
Sangareddy
X

Sangareddy: పోతిరెడ్డిపల్లిలో వైభవంగా దుర్గాభవాని శరన్నవరాత్రి ఉత్సవాలు!

Sangareddy: సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన శ్రీ దుర్గాభవాని శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, కౌన్సిలర్ పొన్న దశరథ్ రెడ్డి, విఠల్, చిక్కుల మల్లేశం, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

SRIKANTH, SANGAREDY

SRIKANTH, SANGAREDY