Medak: గణేష్ మండపాల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పూజలు!

Medak: మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు నియోజకవర్గంలోని వినాయక మండపాల్లో పూజలు నిర్వహించి, కోమటూర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

NAGARAJ, MEDAK
Published on: 25 Sept 2026 7:32 PM IST
Medak
X

Medak: గణేష్ మండపాల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పూజలు!

మెదక్, సెప్టెంబర్ 25: మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు శుక్రవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులతో మాట్లాడి వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.

భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ప్రజలకు శాంతి, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని వినాయకుడిని ప్రార్థించారు.

అనంతరం కోమటూర్ చెరువు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రోహిత్ రావు వినాయక నిమజ్జనం కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ఉత్సవ కమిటీలు చేపట్టిన ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నిమజ్జన ప్రాంతంలో భక్తుల రాకపోకలు, జనసందోహం నియంత్రణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై ఆయన పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జరిగేలా అధికారులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిమజ్జన ప్రాంతంలో పరిశుభ్రతను కాపాడాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK