Patancheru: పౌరసరఫరాల కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జిఎంఆర్!

Patancheru: పౌరసరఫరాల కమిషనర్ నాగిరెడ్డిని శుక్రవారం ఎమ్మెల్యే జిఎంఆర్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Nov 2026 2:53 PM IST
Patancheru
X

Patancheru: పౌరసరఫరాల కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జిఎంఆర్!

పటాన్చెరు: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నూతన కమిషనర్ గా ఇటీవల నియమితులైన నాగిరెడ్డిని పటాన్చెరు శాసనసభ్యులు, తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని డీలర్ల సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీలర్లకు గౌరవ వేతనం, క్వింటాలుకు 300 రూపాయల కమిషన్, ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ వే బ్రిడ్జిల ఏర్పాటు, 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, తదితర అంశాలను అమలు చేయాలని కోరారు.

ఇందుకు సానుకూలంగా స్పందించిన నాగిరెడ్డి.. ప్రభుత్వంతో చర్చించి డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, రాష్ట్ర ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్