Patancheru: ఘనంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా సెలెక్షన్స్.. హాజరైన ఎమ్మెల్యే!

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మైత్రి మైదానంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Nov 2026 12:37 PM IST
Patancheru
X

Patancheru: ఘనంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా సెలెక్షన్స్.. హాజరైన ఎమ్మెల్యే!

Patancheru: క్రీడలకు వయస్సు అడ్డంకి కాదని.. మలి వయస్సులోనూ క్రీడలలో తమ సత్తా చాటుతూ మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ చైర్మన్, ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై.. లాంచనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతాయని అన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ తాము ముందుంటామని అన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ క్రీడలకు పటాన్చెరు వేదికగా నిలవడం గర్వంగా ఉందన్నారు.

జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను త్వరలో నిజామాబాద్ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గురువారెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకర్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్