Patancheru: అబ్దుల్ కలాం ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం..ఎమ్మెల్యే!

Patancheru: పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Oct 2026 10:04 AM IST
Patancheru
X

Patancheru: అబ్దుల్ కలాం ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం..ఎమ్మెల్యే!

Patancheru: పటాన్చెరు దివంగత రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గల ఆయన కాంస్య విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి వినమ్ర నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

అత్యంత నిరుపేద కుటుంబం నుండి జీవితాన్ని ప్రారంభించి దేశానికి రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, సీనియర్ నాయకులు పరమేష్, అశోక్, శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, వెంకటేష్, ఆశమ్, కొండల్, శ్యాం, షకీల్, రామ్మోహన్, వీరారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్