Narsapur: నర్సాపూర్ నియోజకవర్గంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే!
Narsapur: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి సూచించారు.
Narsapur: నర్సాపూర్ నియోజకవర్గంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే!
Narsapur: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి సూచించారు.
ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నర్సాపూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాగజ్మద్దూర్, నర్సాపూర్, పెద్ద చింతకుంట, ఖాజీపేట గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, పెద్ద చింతకుంట సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ అంజయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
అలాగే రైతులు విఠల్, యాదగౌడ్, గౌరయ్య, నరేందర్, మల్లేశం, వెంకటేష్, రాజు, పీఏసీఎస్ సిబ్బంది వెంకటస్వామి, శ్రీనివాస్, కుమార్, గోపాల్, పెద్ద చింతకుంట కొనుగోలు కేంద్రం ఇన్చార్జి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు మద్దతు ధర అందించడంతో పాటు ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడనున్నాయి.




