Medak: నర్సాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Medak: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
Medak: నర్సాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
మెదక్ జిల్లా: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలంలో ని పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజల వరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దళారులకు వరి ధాన్యాన్ని అమ్మకుండా ప్రభుత్వం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని రైతులు అమ్మాలని సూచించారు. రైతులు వరి ధాన్యం తూకం వేసిన వారం రోజులని రైతుల అకౌంటులకు పైసలు వేయాలని అలా కాకుండా రైతులను చుట్టూ పైసలు వారి వారి అకౌంట్లో జమ చేయాలని సూచించారు. అంతేకాకుండా మ్యాచర్ అని తాలు అని రైతులను ఇబ్బంది పెట్టవద్దని పేర్కొన్నారు. సన్నధాన్యానికి బోనస్ అమౌంట్ కూడా తొందరగా వేయాలని పెండింగ్లో పెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. తూకం వేసిన వారి ధన్యపు బస్తాలను రైస్ మిల్లర్లకు తరలించే విధంగా లారీ లను సమాకూర్చాలని కోరారు. అలాగే రైతులకు కాళీ బస్తాలను సుతిల్ తాడులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రామాగౌడ్ తో పేరు తెరాస నాయకులు సతీష్ తో పాటు కౌడిపల్లి తెరాస నాయకులు అధికారులు పాల్గొన్నారు.




