Medak: బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు సంఘటితంగా కృషి చేయాలి ఎంపీ రఘునందన్ రావు
Medak: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కార్యకర్తలు శ్రమించాలి
Medak: బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు సంఘటితంగా కృషి చేయాలి ఎంపీ రఘునందన్ రావు
మెదక్: భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు సంఘటితంగా పనిచేయాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. శనివారం మెదక్ వినాయక కన్వెన్షన్లో నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ మెదక్ జిల్లా ప్రశిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర కీలకమని అన్నారు.
స్వామి వివేకానంద బోధనలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కార్యకర్త కనీసం పది మందిని పార్టీ వైపు ఆకర్షించేలా సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. శిక్షణ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాదా మల్లేష్ గౌడ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, పరిశీలకులు, ఇన్‌చార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




