Narsapur: మృగశిర కార్తె వేళ.. నర్సాపూర్‌లో కిక్కిరిసిన చేపల మార్కెట్

Narsapur: నర్సాపూర్‌లో మృగశిర కార్తె సందడి. చేపల మార్కెట్‌కు పోటెత్తిన ప్రజలు.

G Ashok Reddy, Narsapur
Published on: 8 Jun 2026 1:33 PM IST
Narsapur
X

Narsapur: మృగశిర కార్తె వేళ.. నర్సాపూర్‌లో కిక్కిరిసిన చేపల మార్కెట్

Narsapur: మృగశిర కార్తెను పురస్కరించుకుని నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చేపల మార్కెట్ వినియోగదారులు, వ్యాపారులతో కిక్కిరిసిపోయింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మృగశిర కార్తె సందర్భంగా చేపల కొనుగోళ్లకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

స్థానిక రైతులు, చేపల వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాల చేపలను మార్కెట్‌కు తీసుకురావడంతో మార్కెట్ సందడిగా మారింది. చేపల కొనుగోళ్ల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో మార్కెట్‌తో పాటు ప్రధాన రహదారులు కూడా రద్దీగా కనిపించాయి.

మృగశిర కార్తె రోజున చేపలు తినడం వలన ఆరోగ్యానికి మంచిదనే నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున చేపలను కొనుగోలు చేస్తుంటారు. వేసవి తాపం కూడా పోయి శరీరం చల్లబడుతుందని మృగశిర రోజు చేపలు పెద్ద ఎత్తున ప్రజలు కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లోకి కొత్త రకాల చేపలు కూడా భారీగా వచ్చి చేరాయి. అయితే చేపల ధరలు గతంతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉన్నాయని వినియోగదారులు పేర్కొన్నారు.

చేపల విక్రయాల సందర్భంగా పరిశుభ్రత పాటించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని మున్సిపల్ సిబ్బంది వ్యాపారులకు సూచనలు చేశారు. మొత్తానికి మృగశిర కార్తె సందర్భంగా నర్సాపూర్ చేపల మార్కెట్ సందడిగా మారి, వ్యాపారులకు మంచి వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story