Narayankhed: గానకోకిల ఎస్. జానకి గారికి రావి ఆకుపై వినూత్న నివాళి
Narayankhed: నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివ కుమార్ గానకోకిల ఎస్. జానకి గారికి వినూత్నంగా రావి ఆకుపై చెక్కిన లీఫ్ ఆర్ట్‌ను రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు.
Narayankhed: గానకోకిల ఎస్. జానకి గారికి రావి ఆకుపై వినూత్న నివాళి
Narayankhed: భారతీయ సినీ సంగీత రంగంలో తన మధుర గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన గానకోకిల ఎస్. జానకి గారికి నారాయణఖేడ్‌కు చెందిన శివ కుమార్ (Shiva Leaf Artist) వినూత్నంగా రావి ఆకుపై చేతితో చెక్కిన లీఫ్ ఆర్ట్‌ను రూపొందించి నివాళులర్పించారు.
సాధారణ రావి ఆకును ప్రత్యేక పద్ధతిలో సిద్ధం చేసి, అత్యంత సూక్ష్మంగా చేతితో చెక్కుతూ ఎస్. జానకి గారి చిత్రాన్ని కళాత్మకంగా మలిచారు. ఈ లీఫ్ ఆర్ట్ ఆమెపై ఉన్న గౌరవం, అభిమానం, సంగీతానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా రూపొందించినట్లు శివ కుమార్ తెలిపారు.
ఎస్. జానకి గారు పాడిన వేలాది పాటలు భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆమె గాత్రం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గొప్ప కళాకారులు భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారి కళ ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ఆయన అన్నారు.
శివ కుమార్ గత కొన్నేళ్లుగా ప్రముఖులు, సామాజిక సేవకులు, కళాకారులు, వివిధ ప్రత్యేక సందర్భాల కోసం రావి ఆకుపై చేతితో లీఫ్ ఆర్ట్ రూపొందిస్తూ తన ప్రత్యేక కళతో గుర్తింపు పొందుతున్నారు.




