Medak: వైద్యుల నిర్లక్ష్యంతో ఎనిమిది నెలల పసికందు మృతి!
Medak: మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎనిమిది నెలల బాలుడు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు.
Medak: వైద్యుల నిర్లక్ష్యంతో ఎనిమిది నెలల పసికందు మృతి!
Medak: వైద్యం వికటించి ఓ పసికందు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలోని మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు కుటుంబీకుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. నర్సాపూర్ మండల పరిధిలోని జక్కపల్లి గ్రామానికి చెందిన మంజుల ఆంజనేయులు దంపతుల 8 నెలల పసికందు మణివర్ధన్ కు సోమవారం మూడు గంటల సమయంలో జ్వరం వచ్చిందని నర్సాపూర్ లోని అమ్మ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు.
అనంతరం బాలుడికి పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్సలు జరిపారు. అయితే మంగళవారం ఉదయం వైద్యులు పసికందు చిన్నారి మణి వర్ధన్ పరిస్థితి విషమంగా ఉందని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. వెంటనే కుటుంబీకులు బాలుడిని అంబులెన్స్ లో సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. సంగారెడ్డి ఆసుపత్రిలో అక్కడి వైద్యులు పరీక్షించగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు చెప్పారు.
అమ్మ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని కావాలని పరిస్థితి విషమంగా ఉందని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించే విధంగా చేశారని కుటుంబీకులు ఆరోపించారు. అంతకు ముందే బాలుడు అమ్మ హాస్పిటల్ లోనే మృతి చెందాగా కావాలి అనే సంగారెడ్డి ఆసుపత్రి కి తరలించారని ఆరోపించారు.8 నెలల పసి కందు బాలుడు మణివర్ధన్ మృతికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. అమ్మ ఆసుపత్రిలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చేశారు.
ఇట్టి విషయమై అమ్మ హాస్పిటల్ చైర్మన్ విజయ్ కుమార్ ని సంప్రదించగా బాలుడి పరిస్థితి విషమంగా మారడంతో సంగారెడ్డి ఆసుపత్రికి రిఫర్ చేసినట్టు తెలిపారు అక్కడ వైద్యం అందించాలని అట్టి విషయాన్ని వాళ్లు దాచిపెడుతున్నారని పేర్కొన్నారు. డ్యూటీ డాక్టర్ని రాజ్ కుమార్ ను విధుల నుండి తొలగిస్తున్నట్టు చెప్పారు తనని పది లక్షల వరకు డిమాండ్ చేస్తే తాము రెండున్నర లక్షలు మృతుడి కుటుంబానికి చెల్లిస్తున్నట్టు డాక్టర్ విజయకుమార్ తెలిపారు.




