Narsapur: ఆర్టీసీ అధికారులతో పాన్ షాప్ యజమాని వాగ్వాదం!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ ప్రాంగణంలో పాన్ షాప్ తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది.
Narsapur: ఆర్టీసీ అధికారులతో పాన్ షాప్ యజమాని వాగ్వాదం!
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాన్ షాప్‌ను తొలగించే విషయంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ అధికారులు షాప్‌ను ఖాళీ చేయించాలని సూచించగా, పాన్ డబ్బా యజమాని షర్పోద్దిన్‌తో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆర్టీసీ అధికారుల వివరాల ప్రకారం, బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న పాన్ డబ్బాను తొలగించాలని గత ఏడాది నవంబర్ 25న యజమానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు షాప్‌ను ఖాళీ చేయకపోవడంతో జిల్లా స్థాయి ఆర్టీసీ అధికారులు నర్సాపూర్ బస్టాండ్‌కు చేరుకుని స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు.
ఈ క్రమంలో పాన్ డబ్బా యజమాని షర్పోద్దిన్ అధికారుల చర్యను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు బస్టాండ్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, యజమాని మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు.నిబంధనల ప్రకారం చర్యలు సాయంత్రం మూడు గంటల వరకు ఆర్టీసీ అధికారులు సమయం ఇవ్వడంతో షాపు యజమాని షాప్ కి తాళం వేసి వెళ్ళిపోయారు.




