Narsapur: కాంట్రాక్టర్ బిల్లు కోసం లంచం డిమాండ్.. ఏసీబీ చిక్కిన ఏడీఈ

Narsapur: నర్సాపూర్‌లో ఏసీబీ పంజా! రూ. 25 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విద్యుత్ శాఖ ఏడీఈ రమణారెడ్డి. ఇంట్లోనూ కొనసాగుతున్న సోదాలు.

G Ashok Reddy, Narsapur
Published on: 22 May 2026 8:13 PM IST
Narsapur
X

Narsapur: కాంట్రాక్టర్ బిల్లు కోసం లంచం డిమాండ్.. ఏసీబీ చిక్కిన ఏడీఈ

Narsapur: నర్సాపూర్ లోని విద్యుత్ శాఖ ఏడిఏ కార్యాలయంలో లంచం తీసుకుంటున్నంగా ADE ని పట్టుకున్న ఏసీబీ అధికారులు. కాంట్రాక్టర్ బిల్లు 3లక్షల 13 ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయల బిల్లు పెండింగ్ విషయంలో 30 వేల రూపాయలు లంచం డిమాండ్ కాంట్రాక్టర్ ని ఏడీఈ రమణారెడ్డి డిమాండ్ చేయగా సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఈనెల 20న ఆశ్రయించారు. ఏడీఈ రమణారెడ్డి పెండింగ్లో ఉన్న బిల్లు సాంక్షన్ చేయాలంటే 30000 తనకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయగా సదరు కాంట్రాక్టర్ 25వేల రూపాయలు ఇస్తానని ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు శుక్రవారం నాడు సదర్ కాంట్రాక్టర్ ఏ డి ఏ రమణారెడ్డికి 25 వేల రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏడిఇ రమణారెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు డి.ఎస్.పి సుదర్శన్ తెలిపారు.. ఏ డి ఇ రమణారెడ్డిని పూర్తి విచారణ అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని డిఎస్పి సుదర్శన్ మీడియాతో తెలిపారు విద్యుత్ శాఖ అనే కాకుండా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే లంచం అనే డిమాండ్ చేస్తే తమని సంప్రదించాలని సంప్రదించ వారి సంప్రదించిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తమ టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రజలను కోరారు. తమ వెంట ఇద్దరు ఇన్స్పెక్టర్ లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story