Narsapur: నర్సాపూర్ డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

G Ashok Reddy, Narsapur
Published on: 16 May 2026 7:45 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ లోని డంపింగ్ యార్డ్ లో శనివారం నాడు సాయంత్రం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.మంటలు చెలరేగడంతో పాటు పెద్ద ఎత్తున పొగ రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అర్పే ప్రయత్నం కొనసాగిస్తున్నారు విపరీతమైన ఎండల వేడి వల్లనో లేక ఎవరో ఆకతాయిలు చేసిన పని వల్లనో డంప్ యార్డ్ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం పైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఘటన వల్ల డంపు యార్డ్ చుట్టూ పక్కల ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రస్తుతం డంప్ యార్డ్ లో మంటలు అదుపులోకి తేవడానికి ఫైర్ ఇంజన్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story