Narsapur: పేదరిక నిర్మూలన మెప్మాతోనే సాధ్యం.. మున్సిపల్ చైర్‌పర్సన్

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో 99 రోజుల 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా కిషోర్ బాలికలకు హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు.

G Ashok Reddy, Narsapur
Published on: 23 May 2026 6:01 PM IST
Narsapur
X

Narsapur: పేదరిక నిర్మూలన మెప్మాతోనే సాధ్యం.. మున్సిపల్ చైర్‌పర్సన్

Narsapur: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పురపాలక సంఘం కార్యాలయం నందు చైర్ పర్సన్ శ్రీమతి మచునూరి లక్ష్మి రాజు యాదవ్ ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీ చెరుకు సాయికుమార్ గారు మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కిషోర్ బాలికల హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా 31 మంది కిషోర్ బాలికలకు హిమగ్లోబిన్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా 14-15 సంవత్సరాల వయసుగల బాలికలు తప్పకుండా HPV Vaccine చేయించుకోవాలని మరియు పౌష్టికాహారం తీసుకోవాలని నర్సాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్ సూచించారు.ఇ కార్యక్రమంలో TMC దేవపాల గారు స్థానిక వైద్యులు డా.సునీత గారు, మెప్మా ఆర్పీలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story