Narsapur: నర్సాపూర్‌లో ఆషాఢ సోమవార వైభవం శివాలయానికి పోటెత్తిన భక్తులు!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ శివాలయంలో ఆషాఢ మాస సోమవారం వేడుకలు. గురూజీ వీరప్ప ఆధ్వర్యంలో రుద్రాభిషేకాలు, అన్నదానం. ప్రత్యేక పూజలు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 13 July 2026 10:54 AM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో ఆషాఢ సోమవార వైభవం శివాలయానికి పోటెత్తిన భక్తులు!

Narsapur: నర్సాపూర్ మెదక్ జిల్లా ఆషాఢ మాస పవిత్ర సోమవారం సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శివాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.

వాయిస్ ఓవర్:

"హర హర మహాదేవ్... ఓం నమః శివాయ..." నామస్మరణలతో నర్సాపూర్ పట్టణంలోని శివాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని శివలింగానికి జలాభిషేకం, పాలాభిషేకం, రుద్రాభిషేకం, బిల్వార్చన నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడిని దర్శించుకుంటున్నారు.

ఆలయ ప్రధాన అర్చకులు గురూజీ వీరప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించడంతో పాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గురూజీ వీరప్ప మాట్లాడుతూ... ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు పుష్కలంగా పంటలు పండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ శివుడి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు పొందాలని ఆకాంక్షించారు.

సోమవారం శివారాధనకు ఉన్న విశిష్టతతో నర్సాపూర్ శివాలయంలో భక్తుల రద్దీ గంట గంటకూ పెరుగుతుండగా, ఆలయ ప్రాంగణం శివనామస్మరణలు, భజనలు, హారతులతో భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story