Narsapur: నర్సాపూర్ సర్కారు బడిలో మున్సిపల్ చైర్‌పర్సన్ తనిఖీ!

Narsapur: నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు.

G Ashok Reddy, Narsapur
Published on: 20 April 2026 4:23 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ సర్కారు బడిలో మున్సిపల్ చైర్‌పర్సన్ తనిఖీ!

Narsapur: నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఈరోజు మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాఠశాలలో విద్యార్థులకు వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులు మరియు విద్యా ప్రమాణాలపై వివరంగా చర్చించారు.

పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నిచర్, పరిశుభ్రత వంటి అంశాలను స్వయంగా పరిశీలించి, అవసరమైన చోట వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కూడా పాల్గొని పాఠశాల అభివృద్ధికి అవసరమైన సూచనలు చేశారు.

పాఠశాల అభివృద్ధికి మున్సిపాలిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని చైర్మన్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించి, పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story