Narsapur: ప్రజపాలనలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
Narsapur: నర్సాపూర్ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా విద్యార్థినులకు వ్యాసరచన, నృత్య మరియు మౌఖిక పోటీలు నిర్వహించారు.
Narsapur: ప్రజపాలనలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
Narsapur: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ తిరుపతి గార్ల ఆదేశాల మేరకు ప్రకారం మున్సిపల్ మేనేజర్ వి మధుసూదన్,
హాస్టల్ వార్డెన్ గాయత్రి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ బాలికల వసతి గృహ విద్యార్థినులకు మౌఖిక,నృత్య, వ్యాసరచన మరియు ఇతర పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు తమ చదువు తో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తిని ప్రదర్శించాలని మున్సిపల్ అధికారులు విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు మున్సిపల్ సిబ్బంది హాస్టల్ సిబ్బంది ఫాల్గొన్నారు.
Next Story




