Narsapur: పట్టపగలే దొంగతనం.. బ్యాంకు క్యూలో రూ. 50 వేలు మాయం!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌ ఎస్బీఐ బ్యాంకులో దొంగతనం. గూడెం గడ్డ గ్రామానికి చెందిన పర్వతాలు అనే వ్యక్తి జేబులోని రూ. 50,000 నగదును దుండగులు కాజేశారు.

G Ashok Reddy, Narsapur
Published on: 27 April 2026 8:07 PM IST
Narsapur
X

Narsapur: పట్టపగలే దొంగతనం.. బ్యాంకు క్యూలో రూ. 50 వేలు మాయం!

Narsapur: మెదక్ జిల్లా నరసాపూర్ మండలంలోని గూడెం గడ్డ గ్రామానికి చెందిన పర్వతాలు అనే వ్యక్తి ఈరోజు అవసరం నిమిత్తం నర్సాపూర్ యూనియన్ బ్యాంకు నుండి 50000 వేల రూపాయలు విత్ డ్రా చేసుకొని బ్యాంకు నుండి బయటకు వచ్చి తన స్నేహితుడు అయినా రవి ఫోన్ చేయడంతో ఎస్బిఐ బ్యాంక్ కి వెళ్ళాడు తన స్నేహితుని కోసం బ్యాంకులో ఫామ్ నింపి క్యూ లైన్ లో ఉండగా అదే సమయంలో నరసాపూర్ కి చెందిన రామారావు పుష్పలేటి శ్రీహరి అనే వ్యక్తులు తన వెనకాల నిలబడి కావాలని ముందుకు నెట్టేశారు.

అట్టి సమయంలో తమ జేబులో ఉన్న డబ్బులు చెక్ చేసుకోగా బ్యాంకు లో నుండి విత్ డ్రా చేసిన అమౌంట్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినట్టు పేర్కొన్నాడు ఆ తరువాత నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తమ డబ్బులు తనకు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సీ రంజిత్ కుమార్ రెడ్డి కేసు నమోదు చేసుకొని సిసి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్ఐ రంజిత్ రెడ్డి పేర్కొన్నాడు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story