Narsapur: నర్సాపూర్‌లో ధాన్యం అన్‌లోడింగ్ పరిశీలన..

Narsapur: నర్సాపూర్ షుగర్ ఫ్యాక్టరీలో ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 6 Jun 2026 8:49 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో ధాన్యం అన్‌లోడింగ్ పరిశీలన..

నర్సాపూర్‌: నర్సాపూర్‌లో ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని షుగర్ ఫ్యాక్టరీలో కొనసాగుతున్న ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను అదనపు కలెక్టర్ నగేష్ శనివారం ఆర్డీవో, తహసిల్దార్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన ధాన్యం కొనుగోలు, అన్‌లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వాహనాల నుంచి ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేసి రైతులు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు.

అలాగే ట్యాబ్ ఎంట్రీలు, డేటా నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేసి కొనుగోలు వివరాలను సకాలంలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతమైన సేవలు అందిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story