Narsapur: నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్‌లో ఘనంగా వన మహోత్సవం!
Narsapur: నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్‌లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ప్రజలకు పిలుపు.
Narsapur: నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్‌లో ఘనంగా వన మహోత్సవం!
Narsapur: పచ్చదనం పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్‌లో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేవలం మొక్కలు నాటడంతో బాధ్యత పూర్తికాదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి అది పెద్ద చెట్టుగా ఎదిగేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
భావితరాల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పచ్చదనం ఎంతో కీలకం అని పేర్కొన్న ఎమ్మెల్యే.. మన కోసం మాత్రమే కాకుండా రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్‌ల అభివృద్ధితో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
“మొక్క నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు.
అటవీ శాఖకు చెందిన ఎఫ్ఆర్ఓ దివ్య, సెక్షన్ ఆఫీసర్ సాయిరాంతో పాటు అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థులు కూడా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వన మహోత్సవం సందర్భంగా అర్బన్ ఫారెస్ట్ ప్రాంగణంలో మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయడంతో పాటు, నర్సాపూర్ పట్టణాన్ని మరింత పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమాలు కేవలం ఒకరోజుకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగించాలని, నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు.
ఇ వన మహోత్సవ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, 10వ వార్డు కౌన్సిలర్ బుల్లెట్ రాజు, బీఆర్ఎస్ నాయకులు పంబాల బిక్షపతి, నాగరాజు గౌడ్, బాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి జీవన్ రెడ్డి,మహిపాల్ రెడ్డి, షేక్ హుస్సేన్ రింగుల ప్రసాద్,బోగా శేఖర్,శివ కుమార్,తదితరులు పాల్గొన్నారు.




