Narsapur: నర్సాపూర్‌లో కలకలం భార్య, కుమారుడు అదృశ్యం!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలో భార్య అనిత, కుమారుడు వర్షిత్ అదృశ్యం. నర్సాపూర్ పిఎస్‌లో ఫిర్యాదు చేసిన ప్రైవేట్ టీచర్ రాజేందర్.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 3 Sept 2026 6:57 AM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో కలకలం భార్య, కుమారుడు అదృశ్యం!

Narsapur: ఇంట్లో భార్య, పిల్లలతో అంతా సవ్యంగానే ఉందనుకున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లిన భర్త.. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య, పెద్ద కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి గ్రామంలో చోటుచేసుకుంది.

నర్సాపూర్ ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిప్పల్ తుర్తి గ్రామానికి చెందిన గూగులోత్ రాజేందర్ ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం శివంపేట మండలం చండీ గ్రామపంచాయతీ పరిధిలోని రూప్‌సింగ్ తండాకు చెందిన అనితను వివాహం చేసుకున్నాడు. వీరికి వర్షిత్ (11), వరుణ్ తేజ్ (10) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

మంగళవారం ఎప్పటిలాగే రాజేందర్ సూరారంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లాడు. విధులు ముగించుకుని సాయంత్రం సుమారు 7 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అయితే ఇంట్లో భార్య అనిత, పెద్ద కుమారుడు వర్షిత్ కనిపించలేదు. దీంతో మొదట చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాడు. అనంతరం బంధువులు, తెలిసిన వారి ఇళ్లలోనూ ఆరా తీశాడు. అయినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు.

భార్య, కుమారుడు ఎక్కడికి వెళ్లారో తెలియక ఆందోళనకు గురైన రాజేందర్ చివరకు నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ఇద్దరి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి, కొడుకు అదృశ్యానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story