Toopran: మెదక్ కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు!
Toopran: తూప్రాన్‌లో దళితులపై కుల దూషణ, బెదిరింపుల ఘటనపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్. 15 రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని మెదక్ కలెక్టర్‌కు ఆదేశాలు.
Toopran: మెదక్ కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు!
Toopran: దళితులపై కుల దూషణ చేసి చంపుతామని బెదిరించిన ఘటనపై చర్యలు తీసుకోవాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) మెదక్ జిల్లా కలెక్టర్ కు నోటీసు జారీ చేసింది. డి. లింగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషన్ ఈ నోటీసు జారీ చేసింది. ఫైల్ నెంబర్: APCR/IP/TG/2026/348997, తేదీ: 06/11/2026. ఫిర్యాదు అంశం: Caste abuse and threatening to kill
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 కింద సంక్రమించిన అధికారాలతో ఈ విషయంపై విచారణ / దర్యాప్తు చేయాలని కమిషన్ నిర్ణయించింది. నోటీసు అందిన 15 రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను NCSC పోర్టల్ / పోస్ట్ / ఈమెయిల్ ద్వారా సమర్పించాలని కలెక్టర్ ను ఆదేశించింది.
ఘటన తేదీ, పోలీస్ స్టేషన్ వివరాలు, బాధితుడి పేరు చిరునామా, నిందితుల పేర్లు, FIR నెంబర్ & తేదీ, సెక్షన్లు, అరెస్టు అయిన నిందితుల సంఖ్య & తేదీ, చార్జ్ షీట్ నెంబర్ & తేదీ, PoA Act నిబంధనల ప్రకారం బాధితుడికి ఇచ్చిన పరిహారం వివరాలతో పూర్తి నివేదిక ఇవ్వాలని కోరింది.
గడువులోగా సమాధానం రాకపోతే, ఆర్టికల్ 338 కింద సివిల్ కోర్టు అధికారాలను వినియోగించి, కమిషన్ ముందు స్వయంగా లేదా ప్రతినిధి ద్వారా హాజరు కావాలని సమన్లు జారీ చేస్తామని కమిషన్ నోటీసులో హెచ్చరించింది.




