Patancheru: సీఎం సభకు కదిలిన నీలం దండు.. సిద్దిపేటకు 40 వాహనాల ర్యాలీ!
Patancheru: సిద్దిపేట సీఎం సభకు గురువారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ క్యాంపు కార్యాలయం నుండి నీలం మధు ముదిరాజ్ 40 వాహనాల కార్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
Patancheru: సీఎం సభకు కదిలిన నీలం దండు.. సిద్దిపేటకు 40 వాహనాల ర్యాలీ!
పఠాన్ చేరు: ముఖ్యమంత్రి సభకు పటాన్‌చెరు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. సుమారు 40 వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సిద్దిపేటకు బయలుదేరారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ లోని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ క్యాంపు కార్యాలయంలో ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
నీలం మధు పిలుపుతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ర్యాలీ సందడిగా సాగింది. పార్టీ జెండాలు చేతబూని, జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా సిద్దిపేట బాట పట్టారు. వాహనాలన్నీ వరుసగా బయలుదేరడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.
ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా తరలివెళ్లారు. నీలం మధు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు కదలడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, ప్రజా పరతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..




