Sangareddy: రూ.60 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన నిర్మల జగ్గారెడ్డి!
Sangareddy: సంగారెడ్డి 11వ వార్డులో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు.
Sangareddy: రూ.60 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన నిర్మల జగ్గారెడ్డి!
Sangareddy: సంగారెడ్డి పట్టణంలోని 11వ వార్డులో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు. పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, వార్డుల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వనిత, వార్డు కౌన్సిలర్ దశరథ్ రెడ్డి, వార్డు ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ గడ్డం సరిత తులసిరామ్, పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు సతీష్ రెడ్డి, శ్రీశైలం, అన్వర్, శ్రీకాంత్, నాయకులు కూన సంతోష్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.




