Narsapur: రూ.200 మొక్క కేవలం 20 రూపాయలకే ఆయిల్ పామ్ సాగుపై కీలక ప్రకటన

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో 18.20 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. రూ.200 విలువైన మొక్కలను కేవలం రూ.20లకే ప్రభుత్వం అందిస్తోందని

ASHOK REDDY, NARASAPOOR
Published on: 8 July 2026 4:15 PM IST
Narsapur
X

Narsapur: రూ.200 మొక్క కేవలం 20 రూపాయలకే ఆయిల్ పామ్ సాగుపై కీలక ప్రకటన

నర్సాపూర్: నర్సాపూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో సూరారం నర్సింలు గారి 10 ఎకరాల్లో, రుస్తుంపేట్ గ్రామంలో పి. భిక్షపతి గారి 8.20 ఎకరాల్లో మొత్తం 18.20 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ మొక్కలను శనివారం నాటారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి ఎం. దీపిక మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.200 విలువైన మొక్కలను రైతులకు కేవలం రూ.20కే అందజేస్తోందన్నారు.

అలాగే డ్రిప్ ఇరిగేషన్‌పై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, జనరల్ రైతులకు 90 శాతం వరకు సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు రైతు భరోసాతో పాటు అంతర పంటల సాగు కోసం ఎకరానికి రూ.2,100, ఎరువుల కోసం మరో రూ.2,100 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆమె వివరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మోహన్, లీవ్ ఫామ్ రిసోర్సెస్ కంపెనీ టెక్నికల్ పర్సన్లు అజయ్, శ్రీధర్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story