Patancheru: పటాన్చెరులో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్
Patancheru: పటాన్చెరు జేపీ కాలనీ శ్రీ బ్రహ్మంగారి కల్యాణోత్సవం, శాంతినగర్ అమ్మవారి ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాల్లో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని పూజలు చేశారు.
Patancheru: పటాన్చెరులో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్
పటాన్చెరు: పటాన్చెరు పట్టణంలోని జె.పి. కాలనీలో బ్రహ్మంగారి దేవాలయ 6వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన శ్రీ బ్రహ్మంగారి కల్యాణోత్సవం కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతరం శాంతినగర్, రామేశ్వరం బండ, ఇంద్రేశం నవీన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 26వసారి నిర్వహించిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ మండపాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు, భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలతో మమేకమైన మాద్రి పృథ్వీరాజ్.




