Patancheru: మాదారంలో వైభవంగా ఎల్. సంపత్ గౌడ్ కత్తి స్వామి మహా పడి పూజ

Patancheru: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు నియోజకవర్గం మాదారంలో ఎల్. సంపత్ గౌడ్ కత్తి స్వామి మహా పడి పూజ; 500 మంది అయ్యప్ప స్వాములతో శబరిమలైని మరిపించిన వేడుక.

RAJU,TOOPRAN
Published on: 22 Nov 2026 6:46 PM IST
Patancheru
X

Patancheru: మాదారంలో వైభవంగా ఎల్. సంపత్ గౌడ్ కత్తి స్వామి మహా పడి పూజ

పఠాన్ చెరువు: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు నియోజకవర్గంలోని మాదారంలో ఎల్. సంపత్ గౌడ్ కత్తి స్వామి మహా పడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

రాఘవేందర్ గురు స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా పడి పూజ "శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప" శరణుఘోషతో మారుమోగింది. శబరిమలైలో పదునెనిమిది మెట్ల పడి పూజను మరిపించేలా ఈ వేడుక జరిగింది. అయ్యప్ప కీర్తనలతో ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది.

ఈ మహా పడి పూజలో 500 మంది అయ్యప్ప మాల ధారణ వేసుకున్న స్వాములు పాల్గొన్నారు. నల్లని దుస్తులు, , భక్తి శ్రద్ధలతో స్వాములు పడిపూజలో పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN