Patancheru: ఎమ్మెల్యే జిఎమ్ఆర్ సోదరుడి కుమారుడి నిశ్చితార్థం
Patancheru: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి కుమారుడి నిశ్చితార్థం జేఆర్ కన్వెన్షన్లో వైభవంగా జరిగింది. డిప్యూటీ సీఎం, కేటీఆర్, హరీష్ హాజరు.
Patancheru: ఎమ్మెల్యే జిఎమ్ఆర్ సోదరుడి కుమారుడి నిశ్చితార్థం
పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సందీప్ రెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలు శుక్రవారం హైదరాబాద్లోని జేఆర్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం గూడెం సందీప్ రెడ్డికి.. ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వై. నాగిరెడ్డి కుమార్తె హర్ష్యతి తో నిశ్చితార్థ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి, కుమార్తె నైమిష రెడ్డి, ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులు సందీప్ రెడ్డి, హర్ష్యతి దంపతులను ప్రముఖులు ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.




